NewsTelangana

జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం

ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ రోజు ఉదయం సికింద్రబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదాన్ని మరుకముందే తాజాగా జూబ్లీహిల్స్‌లో మరొక అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం.36లోని ఓ భవనంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. జూబ్లీ 800 పబ్ పక్కన ఉన్న ఓ ఆఫీసులో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ మేరకు ఆ భవనంలోని మూడో అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయ్. అయితే ఈ ఘటనను గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు.