తెలంగాణా సర్కార్కు ఊహించని షాక్
తెలంగాణాలో ఒకవైపు అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు పూనుకున్నారు. మరోవైపు ఉపాధ్యాయ పోరాట సంఘాలు ,మత్స్యకారుల కాంగ్రెస్ సంఘాలు కూడా నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తెలంగాణా సర్కార్కు నలు దిక్కుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. అయితే పోలీసులు మాత్రం నిరసనకారులను అదుపు చేయలేక పోతున్నారు. ఈ మేరకు ఈ రోజు అసెంబ్లీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది దీంతో పోలీసులు అక్కడ ప్రస్తుతం ట్రాపిక్ ఆంక్షలు విధించారు. తెలంగాణాలో వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన బాటపట్టారు. పేస్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని వీఆర్ఏలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం వీఆర్ఏలు ఇందిరాపార్క్ నుంచి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే ఇందిరాపార్క్ దగ్గర పోలీసులు వీఆర్ఏలను అడ్డుకున్నారు. దీంతో వీఆర్ఏలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా ఇందిరాపార్క్ , తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర వీఆర్ఏలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ నుంచి అసెంబ్లీ వరకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ నిరసనల నడుమ ప్రస్తుతం అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

