News AlertTelangana

2024 ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు గ్యారంటి

బీజేపీ 2024లో అద్భుత విజయం సొంతం చేసుకోనుందని… 400 పార్లమెంట్ సీట్లు గెలిచి కేంద్రంలో మరో ప్రత్యామ్యాయం లేదని నిరూపించబోతున్నాం అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే నవ్యాంధ్ర కల నెరవేరుతుందని తెలిపారు. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 5 వేలకు పైగా సమావేశాలు నిర్వహిస్తాం అన్నారు. పార్టీని విస్తరించే కార్యచరణలో భాగంగా గతంలో ఓడిపోయిన 144 స్థానల్లో ప్రత్యేక దృష్టి పెట్టాం ఆ జాబితాలో విశాఖ ఉందని జీవీఎల్ వివరించారు.

విశాఖ భూ కబ్జాలపై టీడీపీ , వైఎస్ఆర్‌సీపీ , రెండు సిట్‌లు వేశాయని… కానీ ఆ రిపోర్టులను బయటపెట్టడం లేదని అన్నారు. ఈ విషయంలో టీడీపీ,వైఎస్ఆర్‌సీపీ కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. వైఎస్ఆర్‌సీపీ పాలనకు చరమగీతం పాడే ఎకైక ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన కూటమి మాత్రమే. బీజేపీ, జనసేనతో పొత్తు కొత్తగా పెట్టుకునేది కాదు మేం ఎప్పటి నుంచో భాగస్వామ్యులుగా ఉన్నామని జీవీఎల్ స్పష్టం చేశారు.