ప్రైవేట్ టీచర్ నిర్వాకం.. నిండు ప్రాణం బలి
ఇటీవల కాలంలో విద్యార్థులపై ప్రైవేటు టీచర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టానుసారంగా విద్యార్థులకు పనిష్మెంట్లు ఇచ్చి వారిని చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు తమ ప్రాణాలను సహితం కోల్పోతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు స్కూల్ టీచర్ తాను ఇచ్చిన హోం వర్క్ చేయలేదని ఏడేళ్ల బాలికకు పనిష్మెంట్ ఇచ్చింది.

ఈ పనిష్మెంట్లో భాగంగా విద్యార్థిని మెడపై పుస్తకాలను పెట్టించి మోపించింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. విద్యార్థిని మృతి చెందింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. టీచర్ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు పోలీసులను డిమాండ్ చేశారు.

