మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్
రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలు జరుగుతున్నాయని సీఐడీ వారు మాజీ మంత్రి నారాయణ పై కేసు నమోదు చేసిన విషయం తెలిలిందే. అయితే సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో నారాయణకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. ఈయనతో పాటుగా ఈ కేసులో ఉన్న రామకృష్ణ హౌసింగ్ సోసైటీ డైరెక్టర్ అంజనీకుమార్ , లింగమనేని రమేశ్ అనే వ్యాపారవేత్తకు కూడా ముందస్తు బెయిల్‌కు అనుమతించింది. అయితే ఎమ్మెల్మే ఆళ్ల రామకృష్ణ ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసును నమోదుచేసారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మాజీ మంత్రి నారాయణ సహా మిగిలిన ఇద్దరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతంలో తీర్పును రిజర్వు చేసింది. అసలు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు మంజూరు కాలేదని..అలా మంజూరుకాని పక్షంలో అవినీతి ఎలా జరుగుతుందని నారాయణ తరుపున పిటిషనర్ వాదించారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకున్న హైకోర్టు రాజకీయ పరమైన దురుద్దేశంతోనే పిటిషనర్లపై కేసు నమోదైనట్టు నిర్ధారించి. వారికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.