స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 170 వరకు తగ్గింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,780 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,400 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,620 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,220 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,450 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,670 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గడంతో రూ. 46,400 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గడంతో రూ. 50,620 గా ఉంది.
వెండి ధర విషయానికొస్తే..
ఇక వెండి ధర విషయానికొస్తే రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన వెండి ధరలు శనివారం స్థిరంగా కొనసాగాయి. అయితే ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితం. ఢిల్లీలో మాత్రం కిలో వెండిపై ఏకంగా రూ. 700 పెరిగింది. శనివారం దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 52,300 కాగా, ముంబయిలో రూ. 52,300 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లోనూ కిలో వెండి ధర రూ. 58,000 వద్ద కొనసాగుతోంది.

