మళ్ళీ క్రికెట్ సందడి.. ఇవాళ శ్రీలంకతో ఆఫ్ఘన్ ఢీ
మళ్ళీ సందడి మొదలవుతోంది. క్రికెట్ ప్రియులకు విందును పంచబోతోంది. వినోదాన్ని ఇవ్వబోతోంది. ఆసియా కప్ మ్యాచ్ నేటి నుండి మెదలు కానుంది. ఈ మ్యాచ్ లన్నీ ముందుగా శ్రీలంకలో నిర్వహించాలని భావించారు. అయితే అదేశ పరిస్ధితులు బాగోలేని కారణంగా.. అక్కడ రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్నందున, ఆందోళనలు చెలరేగుతున్నందున వేదికను మార్చారు. ఈ టోర్నీని అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహిస్తున్నారు. వచ్చేనెల 11వరకు జరిగే ఆసియా కప్ టోర్నీలో .. మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. హోరా హోరీగా తలపడనున్నాయి. ఇప్పటికే ఇందులో ఐదు జట్లు అర్హత సాధించగా.. ఆరవ జట్టు కోసం హాంగాంగ్ , కువైట్ , సింగపూర్ , యూఏఈ టీంలు పోటీ పడ్డాయి. ఈ పోటీలో అందరినీ ఓడించి హాంకాంగ్ స్థానం దక్కించుకుంది. ఈరోజు జరిగే ప్రారంభ మ్యాచ్ లో శ్రీలంక జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ రాత్రి ఏడున్నరకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇక జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక , చరిత్ అసలంక , భానుక రాజపక్స , కుసల్ మెండిస్ , ధనుంజయ డి సిల్వా , దసున్ షనక , వనిందు హసరంగా , మహేశ్ తీక్షణ , చమిక కరుణరత్నే , జెఫ్రీ వాండర్సే , అసిత ఫెర్నాండో.

ఆఫ్ఘనిస్తాన్: హజ్రతుల్లా జజాయ్ , రహ్మానుల్లా గుర్జాజ్ , ఉస్మాన్ ఘనీ , ఇబ్రహీం జద్రాన్ , నజీబుల్లా జద్రాన్ , మహ్మద్ నబీ , అజ్మతుల్లా ఒమర్జాయ్ , రషీద్ ఖాన్ , నవీన్-ఉల్-హక్ , ముజీబ్ ఉర్ రెహమాన్ ,ఫరీద్ అహ్మద్.