NationalNews Alert

ఏఐఏడిఎంకే నేతల పిటీషన్లపై న్యాయమూర్తి ఆగ్రహం

తమిళనాడులో అన్నాడీఎంకే నేతల వ్యవహారం పిల్లి ఎలకల సంవాదంగా మారింది. ప్రతి చిన్న విషయానికి కోర్టు మెట్లు ఎక్కడం.. తామర తుంపరగా పిటీష్న్లు దాఖలు అవుతుండడంతో కోర్టుకు తలనొప్పిగా మారింది. దీంతో అన్నా డీఎంకే నేతలపై న్యాయస్ధానం అసహనం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు వేరే పనులేం లేవనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలో కొనసాగుతున్న ద్వంద్వ విధానాలను కట్టిపెట్టి ఏక నాయకత్వం కింద పార్టీ ముందుకు సాగాలని పళని స్వామి నిర్ణయించారు. అయితే నిర్ణయంపై పన్నీర్ సెల్వం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసిన పళని స్వామి .. పలు కీలక నిర్ణాయలు తీసుకున్నారు. పన్నీర్ సెల్వం, ఆయన ఇద్దు కుమారులను పార్టీ నుండి బహిష్కరించారు. అంతేకాకుండా పన్నీర్ అనుచరుల మీద కూడా వేటు వేశారు. అయితే ఈ సమావేశం చెల్లదని ప్రత్యేక న్యాయస్ధానం పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ మళ్ళీ పిటీషన్ వేశారు పళని స్వామి. వీరిద్దరూ మద్రాస్ హైకోర్టుతో పాటు సుప్రిం కోర్టులో కూడా పలు కేసులు దాఖలు చేశారు. వీటిలో ఓ పిటీషన్ కు సంబంధించిన కేసు న్యాయమూర్తి కృష్ణన్‌ రామస్వామి ముందుకు విచారణకు వచ్చింది. ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలంటూ వచ్చిన పిటీషన్లపై న్యాయమూర్తి కృష్ణన్‌ రామస్వామి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.