InternationalNewsNews Alert

భారత్‌లో ఉగ్రదాడికి 30 వేలు తీసుకున్న వ్యక్తి

పాకిస్థాన్ నుండి భారత్‌కు వచ్చిన ఓ ఉగ్రవాదిని సైన్యం అరెస్ట్ చేసింది. అతని వద్ద నుండి ఆసక్తి కర విషయాలను రాబట్టింది. ఆగస్టు 21న నౌషార సెక్టార్ వద్ద జంగర్ అనే ప్రదేశంలో కొందరు ఉగ్రవాదులు కంచెను కత్తిరిస్తుండగా భారత దళాలు అప్రమత్తమై వారిపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాదిని దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ ఉగ్రవాది పీవోకేలోని కోటిల్ జిల్లాకు చెందిన తబ్రక్ హుస్సేన్‌గా గుర్తించారు. అతడిని భారత్‌లో అత్మాహుతి దాడి చేసేందుకు పంపినట్లు , దీనికోసం అతనికి పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజన్స్ ఏజెన్సీ కర్నల్ యూనస్ చౌధ్రీ అనే వ్యక్తి తనకు 30 వేల పాకిస్థానీ రూపాయలు ఇచ్చినట్టు తెలిపాడు.

ఇదిలా ఉండగా ఆగస్టు 22న లామ్ సెక్టార్‌లో మరికొందరు ఉగ్రవాదులు భారత్‌లో కి ప్రవేశించే యత్నం చేశారు. ఆ సమయంలో అక్కడి ప్రాంతంలో భారత్ దళాలు మందుగుండులు అమర్చగా…ల్యాండ్‌మైన్లు పేలి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. దీనిలో మరో ఉగ్రవాది తీవ్రంగా గాయపడినట్టు గుర్తించారు. ఆ సమయంలో వారి వద్ద ఏకే -56 , బుల్లెట్లు , రేషన్ కార్డు దొరికినట్టు భారత దళాలు తెలిపాయి.