NewsTelangana

రాజాసింగ్‌ అరెస్ట్‌

ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి అరెస్ట్‌ అయ్యారు. షాయినాత్‌ గంజ్‌లోని ఇంటికి వెళ్లి ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే రాజాసింగ్‌ ఇంటి దగ్గర భారీగా అభిమానులు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఆయనను భారీ భద్రత నడుమ వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. తనను నగర బహిష్కరణ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ రాజాసింగ్‌ సెల్ఫీ వీడియో విడుదల చేసిన కాసేపటికే పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే రాజాసింగ్‌కు పాత కేసుల్లో పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41ఏ సీఆర్‌పీసీ కింద రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు.

సిటీలో మునావర్‌ ప్రోగ్రామ్‌ జరగటానికి కారణం టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలేనని వీడియోలో రాజాసింగ్‌ పేర్కొన్నారు. తాను వీడియో రిలీజ్‌ చేయడానికి మునావర్‌ ఫారూఖీనే అని స్పష్టం చేశారు. హిందూ ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను అని తెలిపారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటే… అందుకు కారణం ఎంఐఎం నేతలేనని రాజాసింగ్‌ ఆరోపించారు.