మత కలహాలకు టీఆర్ఎస్, ఎంఐఎం కుట్ర
టీఆర్ఎస్, ఎంఐఎంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ ఆరోపణలు డైవర్ట్ చేసేందుకు హైదరాబాద్లో మత విద్వేషాలు, మత ఘర్షణలకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్లాన్ జరిగిందని, ఎంఐఎంతో కలిసి హైదరాబాద్లో అల్లర్లకు కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించడానికే నన్ను అరెస్ట్ చేశారన్నారు. నా కుటుంబం జోలికి వస్తే పరిస్థితి ఇలా ఉంటుందని వార్నింగ్ వచ్చేలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. మీ తాత జేజమ్మలు వచ్చినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని.. ఈ నెల 27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ జరిపి తీరుతామని బండి సంజయ్ కుండబద్దలు కొట్టారు. అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా బండి సంజయ్ కరీంనగర్లో చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది.