బైకాట్ లైగర్‌పై విజయ్ స్ట్రాంగ్ కౌంటర్స్
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం లైగర్. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృంధం అనేక రాష్ట్రాలకు వెళ్తున్నారు. విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌కి చాలా చోట్ల క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక ఈవెంట్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. అయితే ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రం పై బైకాట్ లైగర్ అనే యాష్ ట్యాగ్ నడుస్తోంది. దీనిపై స్పందించిన విజయ్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు.

ఈరోజు ఢీల్లీలో జరిగిన ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన “ నాకు మా అమ్మ ఆశీర్వాదం ఉంది , ప్రజల ప్రేమాభిమానాలు , దేవుడి కృప ఉంది. అలాగే గెలవాలనే ఫైర్ లోపల ఉందన్నారు. ఇక మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఇటీవల జరిగిన హైదరాబాద్ ప్రేస్‌మీట్‌లో విజయ్ మాట్లాడిన మాటలతో సినిమా మీద ఆయనకు ఉన్న ప్యాషన్ , ప్రమోషన్స్ పట్లా డేడికేషన్ కనిపిస్తోంది.
సినిమా ఘాటింగ్ సమయంలో గాయపడి బ్యాక్ పెయిన్ ఉన్నా ఆపకుండా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం దక్షిణాది భాషలతో సహా , హిందీలోను ఒకే సమయంలో తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ లుక్స్‌కి ఫ్యాన్స్ అందరు ఫిధా అవుతున్నారు.