UPI పేమెంట్స్ పై ఛార్జీలు లేవు.. కేంద్రం ఆర్థికశాఖ
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయాలని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆర్‌బీఐ అధ్యయనాలు చేస్తుందని వెలువడిన వార్తలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. యూపీఐ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. యూపీఐ ట్రాన్సక్షన్స్ అనేవి ప్రజలకు ఉపయోగపడే సౌకర్యవంతమైన డిజిటల్ వ్యవస్థ. ప్రతి ఒక్కరు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా డిజిటల్ వ్యవస్థల వైపు మెగ్గుచూపుతున్నారు. అంతే కాక ఇది ఎంతో సులభం , సురక్షితమైన లావాదేవీలను అందిస్తుండడంతో అందరు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.

వీటిపైనా ఛార్జీలు వేసే ఉద్దేశ్యం కేంద్ర ప్రభుత్వంకు లేదని ప్రకటించింది. గతేడాది డిజిటల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్‌కు అండగా నిలిచిన కేంద్ర ప్రభుత్వం తనవంతు ఆర్థిక సహాయాన్ని అందిచింది. డిజిటల్ పేమెంట్స్‌ను అందరు ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ ఏడాది కూడా సహాయాన్ని అందించనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఈ వార్తతో యూపీఐ యూజర్స్ ఊపిరిపీల్చుకుంటున్నారు.
Read more: ఆసక్తి రేపిన అమిత్ షాతో బాద్ షా భేటీ