మునుగోడు తీర్పు ఓ పెద్ద మలుపు కానుంది: డాక్టర్ లక్ష్మణ్
మునుగోడు ఓటర్లు ఈసారి గట్టి తీర్పు ఇవ్వబోతున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు. ఈ ఎన్నిక ఫలితంతో రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడినట్లేనని అన్నారు. ఈ ఉప ఎన్నిక రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఓ మలుపు తిప్పబోతోందని డాక్టర్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజకీయ చిత్రమే పూర్తిగా మారే రోజులు మునుగోడుతో మొదలవుతున్నాయని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని పారదోలి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రోజులు ఆసన్నమయ్యాయన్నారు.