అజిత్ దోవల్ ఇంటి వద్ద భద్రత లోపం… ముగ్గురు కమాండోలపై వేటు
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజిత్ దోవల్ ఇంటి వద్ద భద్రతా లోపం కారణంగా ముగ్గురు సిఐఎస్‌ఎఫ్ కమాండోలను ఫోర్స్ నుండి తొలగించారు. దోవల్ ఇంటి వద్ద విధుల్లో ఉన్న ముగ్గురు కమాండోలను సర్వీసు నుంచి తొలగించగా, సెక్యూరిటీ విభాగానికి నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను, కమాండెంట్ స్థాయి సీనియర్ అధికారిని బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.. హోం మంత్రిత్వ శాఖ తెలిపిన నివేదిక ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలోని అజిత్ దోవల్ ఇంటి వద్ద ఒక వ్యక్తి హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.

ఓ అపరిత వ్యక్తి తన వాహనాన్ని దోవల్ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తినిఅదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సమయంలో దోవల్ ఇంట్లోనే ఉన్నారు. అనంతరం భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని విచారించగా… తనకు తెలియకుండా శరీరంలో ఎవరో చిప్ పెట్టారని, వారే తనను కంట్రోల్ చేస్తున్నారని చెప్పాడు. ఆ వ్యక్తిని ఎంఆర్ఐ స్కానింగ్ చేయగా ఆ వ్యక్తి శరీరంలో ఎలాంటి చిప్ లేదని తేలింది. బెంగళూరు చెందిన ఆ వ్యక్తి అద్దె కారులో దోవల్ ఇంటికి వచ్చాడని, అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ప్రాథమిక విచారణలో గుర్తించారు. అనంతరం అతడిని అరెస్టు చేసి ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగానికి అప్పగించారు. అయితే అజిత్ దోవల్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు పోంచి ఉన్నట్లు ఇప్పటికే పలుమార్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది.భధ్రత లోపం కారణంగా ముగ్గురు కమాండోలను తొలగించారు
