SIIMA అవార్డ్ నామినేషన్స్‌లో PUSHPA (పుష్ప) జోరు తగ్గేదేలే
గతేడాది బాక్సాఫీస్ రికార్డు బద్దలుకొట్టిన పాన్ ఇండియా సినిమా అల్లుఅర్జున్ నటించిన పుష్ప సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డు నెలకొల్పింది. దక్షిణాది చిత్రాల ప్రతిష్ఠాత్మక సైమా అవార్డుల నామినేషన్స్‌లో పుష్ప సినిమా అత్యధికంగా 12 కేటగిరీలలో నామినేట్ అయ్యింది. ఈ అవార్డుల ప్రధానోత్సవం సెప్టెంబర్‌లో 10,11 తేదీలలో బెంగళూరులో జరగబోతోంది. నామినేషన్ల జాబితా ఈరోజు విడుదలయ్యింది. వీటిలో తెలుగు, తమిళ,మలయాళం,కన్నడ భాషల్లో విడుదలైన చిత్రాలు ఏఏ విభాగాలలో పోటీ పడనున్నాయో తెలియజేసారు. తెలుగులో పుష్ప, అఖండ, ఉప్పెన, జాతిరత్నాలు ఎక్కువ విభాగాల్లో నామినేట్ అయ్యాయి.

పుష్ప 12 విభాగాల్లో మొదటి స్థానంలో ఉండగా, బాలయ్య నటించిన అఖండ 10 విభాగాల్లో రెండవస్థానంలో నామినేట్ అయ్యాయి. జాతి రత్నాలు 8 విభాగాల్లో, ఉప్పెన 8 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. పుష్ప మూవీ కలెక్షన్లతో బాటు అవార్డుల పంట కూడా పండించనుంది. దీనితో పుష్ప2 మూవీపై ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోతున్నాయి.

