home page sliderHome Page SliderTelangana

గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోదీకి ఆహ్వానం

దేశ రాజధాని దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌’కు ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌-బెంగళూరు-చెన్నై బుల్లెట్‌ రైలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌ మెట్రో రైలు రెండోదశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు.
పలువురు కేంద్ర మంత్రులతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలను కలిసి సీఎం ఆహ్వానించారు. కాగా, మంగళవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను సీఎం రేవంత్‌రెడ్డి కలిసి గ్లోబల్‌ సమిట్‌కు రావాలని కోరారు.