దేశం విడిచి వెళ్లిపోండి.. ట్రంప్ అల్టిమేటం
అమెరికా వర్సెస్ వెనుజులా మధ్య రోజురోజుకు వివాదం రాజుకుంటోంది. యధేచ్ఛగా తమ దేశంలోకి డ్రగ్స్‌ను పంపుతూ , నేరాలను ప్రోత్సహిస్తోందని వెనుజులాపై అమెరికా ఆరోపణలు చేసింది. ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , వెనుజులా అధ్యక్షుడు మదురో ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ జరిపారు. దేశం విడిచి వెళ్లాలని మదురోకు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. గ్లోబల్ అమ్నెస్టీ, సైనిక అధికారం కొనసాగించాలని మదురో కోరగా, ట్రంప్ తిరస్కరించారు. చర్చలు విఫలమవ్వడంతో, ట్రంప్ సైనిక చర్య హెచ్చరికలు, గగనతలం మూసివేత వంటి కఠిన చర్యలు తీసుకున్నారు.
అమెరికా, వెనుజులా మధ్య ప్రస్తుతం భగ్గుమంటోంది. ఇటీవల వెనుజులా దేశ నౌకపై అమెరికా సైన్యం దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా, వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ట్రంప్ అల్టమేటం ఇచ్చారు. మదురోతో ఫోన్‌లో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ‘నీతో పాటు నీ సన్నిహితులను కాపాడుకో.. కానీ, తప్పనిసరిగా వెనుజులా వీడి వెళ్లిపో’ అని ట్రంప్ హెచ్చరించారు. ఒకవేళ అంగీకరిస్తే మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరేస్, వారి కుమారుడు, ఇతర కీలక నేతలు సురక్షితంగా దేశం దాటేందుకు సహకరిస్తామని అమెరికా పదేపదే ఆఫర్ చేస్తోంది. ఈ షరతులకు వెనుజులా నిరాకరించడంతో చర్చలు విఫలమయ్యాయి.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని తమ దేశానికి చెందిన ప్రతిపక్ష నేత మారియా కోరినాకు ఇవ్వడంపై వెనుజులా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను నికోలస్ మాదురోతో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ధ్రువీకరించారు. ‘మా సంభాషణ బాగా జరిగిందా? లేదా? అనేది నేను’ చెప్పను అని ట్రంప్ పేర్కొన్నారు. వెనిజులా గగనతలాన్ని ‘పూర్తిగా మూసివేయాలని’ బహిరంగంగా హెచ్చరించిన తర్వాత ఆయన ఆచితూచి మాట్లాడారు. చర్చలు విఫలమై, సైనిక సంపత్తిని వెనుజులాకు పంపడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతునున్నాయి .
నవంబరు 16తో ముగి మదురో, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టు మియామీ హెరాల్డ్ ప్రచిరించింది. ఈ క్రమంలో తనకు రెండు హామీలు ఇవ్వాలని ట్రంప్‌ను మదురో కోరడంతో చర్చలు నిలిచిపోయాయి. తనకూ, తన సన్నిహిత వర్గంలోని సీనియర్లకు గ్లోబల్ అమ్నెస్టీ ఇవ్వాలని, అలాగే స్వేచ్ఛాయుత ఎన్నికలకు అనుమతించినా కూడా వెనిజులా సాయుధ దళాలపై తన అధికారం కొనసాగాలని ఆయన కోరాడు. ఈ రెండు హామీలను తోసిపుచ్చిన ట్రంప్ , తక్షణమే మదురోను పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ట్రంప్‌తో మాట్లాడేందుకు మదురో ప్రభుత్వం ప్రయత్నించినా , ఇటువైపు నుంచి స్పందన రాలేదని తెలిపింది.
మదురో, అతడి యంత్రాంగంలోని కీలక వ్యక్తులు అత్యంత తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నారని వెనుజులా సైన్యంతో అనుబంధం, ప్రభుత్వ డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై అవగాహన ఓ రక్షణ నిపుణుడు హెచ్చరించారు. వెనిజులా గగనతలం మీదుగా విమాన సర్వీసులను నడపొద్దని ఆయన ఆదేశించాడు. దీంతో వెనుజులా గగనతలం మీదుగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. వెనిజులా పలు విదేశీ విమానయాన సంస్థల నిర్వహణ హక్కులను రద్దు చేసింది. దీనిని వలసదారులపై అమెరికా దాడిగా పేర్కొంది.

