Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?

విజయవాడ:రాష్ట్రంలో ప్రజాస్వామ్య విధానం పూర్తిగా కూలిపోయిందని ఆరోపిస్తూ, “ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?” అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మండిపడ్డారు.
ఏవీఎస్‌వో సతీష్‌ కేసు గురుంచి మాట్లాడినందుకు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి అవమానమని బొత్స వ్యాఖ్యానించారు. “చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే అన్నీ రోజులు ఒకేలా ఉండవు. ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం” అని స్పష్టం చేశారు.
స్టీల్‌ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా బొత్స తీవ్రంగా ఖండించారు. స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై సీఎం స్పందన అహంకారంతో నిండినదని విమర్శించారు. “మీ వైఖరేంటి అని అడిగితే అహంకారంగా మాట్లాడుతారా? బాధ్యత గల సీఎంగా చంద్రబాబు వ్యవహరించడం లేదు” అని బొత్స ఆరోపించారు.
ప్రస్తుతం సీఎం వ్యవహారశైలిపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ, “ఇది అంబేద్కర్‌ రాజ్యాంగమా? తాలిబాన్ల రాజ్యాంగమా?” అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతిపక్షం పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.