Breaking NewsHome Page Sliderhome page sliderInternational

రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలుపై అమెరికా సెనేట్ కఠిన చర్యలు

వాషింగ్టన్: రష్యా నుంచి క్రూడ్‌ ఆయిల్‌ కొనుగోలు చేసే దేశాలపై భారీ ఆర్థిక భారం మోపే దిశగా అమెరికా ముందడుగు వేసింది. రష్యా చమురు దిగుమతులను కొనసాగిస్తున్న దేశాలపై 500 శాతం టారిఫ్‌ విధించేలా కొత్త బిల్లును అమెరికా సెనేటర్ లిండ్సే గ్రహామ్‌ సెనేట్‌లో ప్రతిపాదించారు.

ఈ బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు ప్రకటించడం విశేషం. దీంతో రష్యా నుంచి అధిక మోతాదులో చమురు దిగుమతి చేసుకునే భారత్, చైనా వంటి దేశాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే, తాజా సమాచారం ప్రకారం, భారత్ ఇప్పటికే రష్యా నుంచి చమురు దిగుమతులను కొంత మేర తగ్గించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అమెరికా ప్రతిపాదించిన ఈ టారిఫ్ నిర్ణయం భవిష్యత్తులో భారత ఇంధన విధానంపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.