Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNews

ఏపీ మెడికల్‌ కాలేజీల పీపీపీ విధానంపై కేఏ పాల్‌ సుప్రీంకోర్టు సవాల్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌ కాలేజీలను పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (PPP) విధానంలో నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కేఏ పాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
మీడియా ప్రచారం కోసం ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయొద్దు,” అని వ్యాఖ్యానించింది.

ఈ అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుందని, ముందుగా ఏపీ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది.
తద్వారా, సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను విచారణ నుంచి విరమించింది.