తల్లి, తమ్ముడిని కత్తితో హత్య చేసిన వ్యక్తి
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. సుంకరపద్దయ్యగారి వీధి, మన్నా చర్చ్ ఎదురుగా జరిగిన ఘటనలో కుమారుడు తన తల్లి, తమ్ముడిని కత్తితో పొడిచి చంపాడు.
మృతులు గునుపూడి మహాలక్ష్మి (60), **గునుపూడి రవితేజ (33)**గా గుర్తించారు. ఈ ఘోర ఘటనకు కారణమైన గునుపూడి శ్రీనివాస్ స్వయంగా 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు.
స్థలానికి చేరుకున్న భీమవరం వన్ టౌన్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తూ, హత్యలకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

