జూబ్లీహిల్స్‌లో మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు జారీ చేశారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు మంత్రులు జూబ్లీహిల్స్‌లోనే అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.
డివిజన్ ఇంఛార్జ్‌లతో కలిసి మంత్రులు సమన్వయంగా పని చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులు, మంత్రులకు సూచించినట్లు సమాచారం.

