SLBC టన్నెల్‌పై రాజకీయాలు తగవు: సీఎం రేవంత్
నాగర్‌కర్నూల్: SLBC టన్నెల్ పనులపై BRS నేతలు రాజకీయాలు చేయడం తగదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లి పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ —
“SLBC పనులను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. పదేళ్లలో 10 కిలోమీటర్ల టన్నెల్ కూడా పూర్తి చేయలేదు. కమీషన్లు రావని ప్రాజెక్టును పక్కన పెట్టారు,” అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని రైతులకు పెద్ద ఎత్తున నీటి సౌకర్యం కలుగుతుందని, ప్రభుత్వం దానిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని పేర్కొన్నారు.

