సామాన్యుల కోసం LIC దీపావళి స్కీమ్స్
సామాన్యులు, మధ్యతరగతి వారి కోసం LIC రెండు సూపర్ స్కీమ్స్ ప్రకటించింది. ఇవి LIC జన సురక్ష పథకం,LIC బీమా లక్ష్మి పథకం. దీపావళి కానుకగా అక్టోబర్ 15 నుండి అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రకటనతో మంగళవారం ఎల్ ఐసీ షేర్లు భారీగా పెరిగాయి. ఈ పథకాలు ముఖ్యంగా తక్కువ ఆదాయం గలవారికి తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉంటాయి. అంతేకాదు..ఇవి అసలు రిస్క్ లేకుండా స్టాక్ మార్కెట్ తో ఎలాంటి సంబంధం లేకుండా ఉండడం వల్ల పూర్తి మొత్తానికి భరోసా లభిస్తుంది.
. LIC జన సురక్ష పథకం ద్వారా తక్కువ ఖర్చుతో బీమా పథకం అందిస్తోంది. దీనిని నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ బీమా పథకంగా పేర్కొంటున్నారు. మార్కెట్ బోనస్ సంబంధం లేకుండా ఉంటాయి. ఇవి బలహీన వర్గాల వారికి తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉంటాయి.
. LIC బీమా లక్ష్మి పథకం కూడా మహిళల కోసం కొత్త జీవిత బీమా సేవింగ్స్ స్కీమ్. నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ స్కీమ్. ఈ పథకంలో బోనస్ లేకపోయినా..జీవిత బీమా, మెచ్యూరిటీ సేవింగ్స్ రెండిటినీ అందిస్తుంది.