Breaking Newshome page sliderHome Page SliderTelangana

పాదయాత్రకు సిద్దమవుతున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర యాత్ర చేయాలని నిర్ణయించారు. అక్టోబర్‌ చివరివారంలో యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు . తెలంగాణలో అన్ని జిల్లాల మీదుగా యాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. మాజీ సీఎం, స్వయానా తండ్రి కేసీఆర్‌ ఫొటో లేకుండా యాత్ర చేయాలని నిర్ణయించారు. ప్రొఫెసర్ జయశంకర్‌ ఫొటోతో యాత్ర పోస్టర్లు డిజైన్ చేయాలని జాగృతి శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ మేధావులు, విద్యావంతులతో ఇటీవల కవిత వరుసగా భేటీలు అవుతున్నారు.బుధవారం యాత్ర పోస్టర్‌ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సంక్షేమం, బీసీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తామని తెలిపారు. బీసీల హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతామని స్పష్టం చేశారు.