home page sliderHome Page SliderNationalPoliticsviral

బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితా విడుదల

పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ తన తొలి అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. మొత్తం 71 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాను పార్టీ కేంద్ర నాయకత్వం విడుదల చేసింది.

డిప్యూటీ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి, మరో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ శ్రేణులు ఇప్పటికే ఎన్నికల రంగంలోకి దూకగా, ఈ జాబితా విడుదలతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.

మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 101 సీట్ల చొప్పున బీజేపీ, జేడీయూ (JDU) పోటీ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాయి. మిగిలిన సీట్లను ఎన్డీఏ కూటమిలోని ఇతర మిత్రపక్షాలకు కేటాయించారు.

బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో మరోసారి స్పష్టమైన మెజారిటీ సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. పార్టీ ప్రధాన నేతలు త్వరలో రెండవ జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

👉 పూర్తి అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి