సీఎం మార్పు వార్తలపై డీకే శివకుమార్ స్పందన — “తలరాత నాకు తెలుసు!”
కర్ణాటక రాజకీయాల్లో సీఎం మార్పు ఊహాగానాలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంపై తొందరేం లేదని, తన తలరాత ఏంటో తనకే తెలుసని ఆయన స్పష్టం చేశారు.
‘నేను సీఎం అయ్యే సమయం వచ్చింది’ అని తాను అన్నట్లు వస్తున్న వార్తలపై డీకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొన్ని మీడియా సంస్థలు నిజాలను వక్రీకరించి సెన్సేషనలిజం చేయడం రాజకీయంగా తగదని ఆయన మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, నవంబర్‌లో కర్ణాటక సర్కారులో మార్పులు జరిగే అవకాశమున్నాయనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.