స్మితా సబర్వాల్‍కు హైకోర్టులో ఊరట
కాళేశ్వరం కేసులో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‍కు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు గురువారం ఆదేశించింది. స్మితా సబర్వాల్ పిటిషన్ ను ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి విచారిస్తామని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవలక వ్యవహారంలో తమ ప్రమేయం ఉందంటూ స్పష్టం చేసిన ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని స్మితా సబర్వాల్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఆ నివేదిక ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని కూడా కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.