యాపిల్, ఓపెన్ఏఐపై కోర్ట్ కెళ్లిన మస్క్
బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ ఎక్స్ఎఐ (XAI) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి మస్క్ సంస్థ, టెక్ దిగ్గజాలు యాపిల్, ఓపెన్ఏఐపై నేరుగా న్యాయపోరాటానికి దిగింది.టెక్సాస్‌లోని యూఎస్ ఫెడరల్ కోర్టులో ఎక్సైఐ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో, AI పరిశ్రమలో పోటీని అణిచివేయడానికి యాపిల్, ఓపెన్ఏఐ చట్టవిరుద్ధంగా కుట్ర పన్నాయి అని మస్క్ సంస్థ ఆరోపించింది. దావా ప్రకారం… యాపిల్ ఓపెన్ఏఐలు తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించడానికి ఎక్స్, ఎక్స్ఎఐ వంటి ఆవిష్కర్తలు ముందుకు రాకుండా అడ్డుకుంటున్నాయి. మార్కెట్‌లో ప్రత్యామ్నాయ AI ఉత్పత్తులు రాకుండా వారిద్దరూ మార్కెట్లను లాక్ చేస్తున్నారని ఎక్స్ఎఐ ఫిర్యాదు చేసింది.మస్క్ సంస్థ వాదన ప్రకారం ఓపెన్ఏఐతో ప్రత్యేక ఒప్పందం లేకపోతే, యాపిల్ తన యాప్ స్టోర్లో “ఎక్స్, గ్రోక్” యాప్‌లకు ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించింది. మా యాప్స్ ఎందుకు ముందుగా ప్రదర్శించబడటం లేదు? అని ఎక్స్ ప్రెస్ ఎఐ (XpressAI) కోర్టులో వాదించింది.అయితే, ఈ ఆరోపణలపై యాపిల్, ఓపెన్ఏఐ ఇంకా స్పందించలేదు.ఇక గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ నెల ప్రారంభంలోనే మస్క్ తన ఎక్స్ ఖాతాలో యాపిల్‌పై కేసు వేస్తానని హెచ్చరించారు. యాప్ స్టోర్‌లో ఓపెన్ఏఐ తప్ప మరే AI కంపెనీ స్థానానికి చేరుకోవడం అసాధ్యం అని ఆయన ట్వీట్ చేశారు. AI రంగంలో గట్టి పోటీ కొనసాగుతున్న ఈ సమయంలో మస్క్ దాఖలు చేసిన ఈ దావా టెక్ పరిశ్రమలో మరో పెద్ద చర్చకు దారితీసింది. యాపిల్, ఓపెన్ఏఐలపై మస్క్ ఆరోపణలు నిజమని తేలితే, అమెరికా టెక్ మార్కెట్‌లో మోనోపొలీ విధానాలపై పెద్ద ఎత్తున ఆంక్షలు వచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

