crimeHome Page Sliderhome page sliderNewsTelanganaviral

పార్కులో కాల్పుల కలకలం… వాకర్ మృతి

హైదరాబాద్ మలక్‌పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శాలివాహననగర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తున్నవారిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన చందు రాథోడ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అనూహ్యంగా జరిగిన కాల్పులతో పార్కులో వాకింగ్ చేస్తున్నవారు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు ఘటన అనంతరం పరారీలో ఉండగా, వారి ఆచూకీ కోసం సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా గాలింపు చేపట్టారు. ఘటనకు ప్రధాన కారణంగా భూ వివాదాలే కారణం గా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.