జగన్ పర్యటన.. సత్తెనపల్లిలో టెన్షన్.. టెన్షన్
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు మొదట అనుమతి నిరాకరించినా, తర్వాత మంజూరు చేశారు. పొదిలి పర్యటన తర్వాత జరిగిన ఘటనల దృష్ట్యా, సత్తెనపల్లిలో పోలీసులు భద్రతను పెంచారు. వైసీపీ నాయకులు మాజీ సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.

