Andhra PradeshHome Page SliderPolitics

కొమ్మినేనికి బెయిల్ రావడంపై స్పందించిన వైసీపీ అధినేత

చంద్రబాబుకు సుప్రీం తీర్పు చెంపపెట్టులాంటిది: వైఎస్ జగన్సీనియర్ పాత్రికేయుడు, సాక్షి చానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. “సత్యమేవ జయతే” అంటూ ట్వీట్ చేశారు. కొమ్మినేనికి సంబంధం లేని వ్యాఖ్యలతో అక్రమ అరెస్ట్ చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సుప్రీం తీర్పుతో చంద్రబాబు కుట్ర బట్టబయలైందని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు గారికి పెద్ద చెంపపెట్టులాంటివి అని తెలిపారు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధిచెప్పిందన్నారు. అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాలపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబుగారు కృత్రిమ వివాదాన్ని సృష్టించారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్‌ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛ‌ను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని ఆయన మండిపడ్డారు.యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేని గారికి విశ్లేషకుడి వ్యాఖ్యలతో ఏం సంబంధం అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ చంద్రబాబు కుట్రను బద్దలు చేసిందని, ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లిందని తెలిపారు.