కలెక్టరేట్‌లో కరోనా కలకలం..
ఏపీలో కరోనా కేసులు ప్రజలను కలవరపెడుతున్నాయి. తాజాగా ఏలూరు కలెక్టరేట్‌లో నలుగురు ఉద్యోగులు కరోనా బారిన పడడం కలకలం సృష్టించింది. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరిని ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారితో కలిసి పనిచేయడంతో ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఇతర జిల్లాలలో కూడా కరోనా విజృంభిస్తోందని సమాచారం. గుంటూరు, తెనాలి, తాడేపల్లి జిల్లాలలో కూడా కేసులు నమోదవుతున్నాయి.