‘వారిని టైమ్ మెషిన్లో వందేళ్లు వెనక్కి తీసుకుపోవాలి’..జగ్గారెడ్డి
తెలంగాణ బీజేపీ నేతలకు మతి చలించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కశ్మీర్‌ను భారత్ నుండి విడిపోకుండా కాపాడింది జవహర్లాల్ నెహ్రూనే అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్నేలే సమయానికి ఇప్పుడు బీజేపీలో విమర్శిస్తున్న వాళ్లెవరూ పుట్టలేదని, అందుకే వారిని టైమ్ మెషిన్లో వందేళ్లు వెనక్కి తీసుకెళ్లి చరిత్ర చూపించాలని ఎద్దేవా చేశారు. నెహ్రూ ప్రధాని అయ్యాక 545 సంస్థానాలను భారత్‌లో విలీనం చేశారని, బీజేపీకి ఏ దిక్కూ లేక సర్దార్ పటేల్‌ను మా వాడు అనుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత వందేళ్లకు బీజేపీ పుట్టిందని, కాంగ్రెస్‌కు మునిమనవడు వయస్సున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. గాంధీ భవన్లో అటెండర్ పోస్టు ఇచ్చినా నాకు సంతోషమేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నిజాయితీ, నీతి, త్యాగం, ప్రేమ కలిగిన గాంధీ కుటుంబం నుండి వచ్చారని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు లిమిట్స్ దాటుతున్నారని హెచ్చరించారు.

