మేము చెప్పిందే ఇప్పుడు కవిత రుజువు చేసింది..
బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని తాము గతంలో చెప్పిన మాటలకు ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ అన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవితను బయటపడేయడానికి బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు స్పష్టమైందని వ్యాఖ్యానించారు.