home page sliderHome Page SliderNewsTelangana

బీఆర్ఎస్, బీజేపీ అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన కవితకు ధన్యవాదాలు..

తెలంగాణలో రాజకీయాలు ఎమ్మెల్సీ కవిత చుట్టూ తిరుగుతున్నాయి. మీడియా చిట్ చాట్ లో కవిత హాట్ కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీ అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన కవితకు ధన్యవాదాలు తెలిపారు. నాకౌట్ మ్యాచ్ లో కవిత బయటకు వెళ్లిపోయారన్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లో హరీష్ రావు ఏక్ నాథ్ షిండేగా మారారన్నారు. భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోతుందని జోస్యం చెప్పారు. తెరముందు మాత్రమే కోడి పంజులు, తెర వెనుక దోస్తులన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని బీఆర్ఎస్ గెలిపించిందని కవిత రుజువు చేశారన్నారు సామ రామ్మోహన్ రెడ్డి.