కర్ణాటక నుండి ఏపీకి కుంకీ ఏనుగులు..ఎందుకంటే?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు కర్ణాటక ప్రభుత్వం ఏపీకి కుంకీ ఏనుగులను పంపడానికి అంగీకరించింది. రేపే కుంకీ ఏనుగులు రాష్ట్రానికి రానున్నాయని వాటి ద్వారా మదపుటేనుగుల వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించవచ్చని పవన్ పేర్కొన్నారు. సరిహద్దు అటవీ ప్రాంతాలలోని పంటపొలాలను మదపుటేనుగులు ధ్వంసం చేస్తున్నాయని, అంతేకాక కొన్ని సందర్భాలలో రైతుల ప్రాణాలను కూడా తీస్తున్నాయని, వాటిని దారి మళ్లించడానికి, విధ్వంసాన్ని అరికట్టడానికి కుంకీ ఏనుగులు సహాయపడతాయని ఆశిస్తున్నామని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.