కేసీఆర్‌కు షాక్..
బీఆర్ఎస్ అధినేత, మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం విషయంలో షాక్ తగిలింది. విచారణకు రమ్మంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీల విషయంలో ఈ కమిషన్ విచారణ జరుపుతోంది. కేసీఆర్ సీఎంగా ఉన్నకాలంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌కు కూడా ఈ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్‌ను జూన్ 5న, హరీశ్ రావును జూన్ 6న, ఈటల రాజేందర్‌ను జూన్ 9న విచారణకు రావాలంటూ నోటీసులు పంపించారు. మేడిగడ్డ బ్యారేజి కుంగిన విషయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరపడానికి రేవంత్ రెడ్డి సర్కార్ న్యాయవిచారణకు ఆదేశించింది. ఈ నెలలో తుది నివేదికను అందించాల్సి ఉండగా ఇప్పటికే ఇంజినీర్లు, అధికారులందరి విచారణలు పూర్తయ్యాయి. చివరిగా అప్పటి మంత్రుల విచారణను కూడా పూర్తి చేసి తుది నివేదికను అందజేస్తారు.

