Home Page SlidermoviesNationalNews Alertviral

రాజమౌళి మెచ్చిన చిత్రం..’అద్భుతం’ అంటూ ప్రశంసలు..

దర్శకధీరుడు రాజమౌళి తాజాగా రిలీజైన ఒక చిత్రంపై ‘అద్భుతం’ అంటూ ప్రశంసలు కురిపించడం ఆశ్చర్యంగా మారింది. శశికుమార్, సిమ్రన్ ప్రధాన పాత్రలలో నటించిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే చిత్రంపై ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చారు. ఈ చిత్రం తనకెంతో నచ్చిందని, అద్భుతమైన చిత్రాన్ని చూశానంటూ పోస్ట్ పెట్టారు. డైరక్టర్ అభిషాన్ గొప్పగా రచించి, డైరక్షన్ చేశారు. ఈ మధ్య నేను చూసిన బెస్ట్ సినిమా ఇదే అంటూ రాసుకొచ్చారు. ఆ చిత్ర దర్శకుడు అభిషాన్ జీవింత్ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాజమౌళి చిత్రాలను ఆశ్చర్యంగా చూసేవాడినని, ఇప్పుడు ఆయన తన సినిమాను ప్రశంసిస్తూ, తనపేరు పలికారని, కలలో కూడా ఊహించలేదు అంటూ రిప్లై ఇచ్చారు. మే1న రిలీజైన ఈ చిత్రం విజయవంతంగా థియేటర్స్‌లో కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని ఇటీవలే రజనీకాంత్, శివకార్తికేయన్ కూడా ప్రత్యేకంగా అభినందించారు. హిట్ కావడంతో జపాన్‌లో కూడా దీనిని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు మూవీ టీమ్ పేర్కొన్నారు.