Home Page SliderNationalNews AlertSportsVideosviral

‘వాళ్లు రానంతమాత్రాన ఐపీఎల్ ఆగదు’..పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ మ్యాచ్‌లు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ వాయిదా పడిన నేపథ్యంలో పలువురు విదేశీ క్రికెటర్లు తమ దేశాలకు వెళ్లిపోయారు. వారు తిరిగి వస్తారా లేదా అనే విషయంలో కొన్ని టీమ్స్‌లో సందిగ్దత నెలకొంది. అయితే పంజాబ్ కింగ్స్ టీమ్ తన ఎక్స్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేసింది. దీనిలో ఐపీఎల్‌కు విదేశీ ఆటగాళ్లు వస్తున్నారా? అనే చర్చ నడుస్తుంటుంది. అప్పుడు టీమిండియా క్రికెటర్ శ్రీయస్ అయ్యర్ వచ్చి ఇది ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ అని చెప్తారు. అంటే వారు రానంత మాత్రాన ఆట ఆగదు అనే ఉద్దేశంతో పంజాబ్ కింగ్స్ ఇలా వీడియో పెట్టింది. ఇటీవల విదేశీ ప్లేయర్లు రాలేని పక్షంలో ఆయా టీమ్‌లు భారత ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చని బీసీసీఐ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.