BusinessHome Page SliderNationalNews Alert

పాత బంగారం ఎక్సేంజ్‌పై  కూడా జీఎస్టీ పడుతుందా?

పాతబంగారు ఆభరణాలు మార్చి కొత్తవి కొనేవారు గమనించాల్సిన విషయం ఒకటుంది. అదే జీఎస్టీ. పన్నుల భారం పెరిగిపోయి బంగారు ఆభరణాల ధరతో పాటు జీఎస్టీ భారం కూడా వినియోగదారుల పైనే పడుతోంది. పాత బంగారం ఎక్సేంజ్ కింద కేవలం బంగారం ధర మాత్రమే ఇస్తారు. కొత్త ఆభరణం తీసుకునేటప్పుడు కనీసం జీఎస్టీ 3 శాతం చెల్లించాల్సి ఉంటుంది. తమ పాత బంగారం మినహాయించి మిగిలిన బంగారానికి మాత్రమే జీఎస్టీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు వినియోగదారులు. అయితే అలా కుదరదని వ్యాపారులు చెప్తున్నారు. తాజాగా జీఎస్టీ శాఖ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. జీఎస్టీని కొత్త ఆభరణం మొత్తానికి చెల్లించాలని, పాత బంగారం ధరకు మినహాయింపు ఏదీ లేదని  పేర్కొంది.