Andhra PradeshHome Page SliderNews AlertPolitics

“ఈ నగరం ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక్ ప్రదేశ్‌గా మార్చే శక్తి”..మోదీ

అమరావతి నగరాన్ని విశ్వనగరంగా రూపొందిస్తున్నామని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధునిక్ ప్రదేశ్‌గా మార్చే శక్తి అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇది కేవలం నగరం కాదని, అమరావతి రైతుల త్యాగాల ఫలితం అని వ్యాఖ్యానించారు. అమరావతి ఆధునిక, అధునాతన సౌకర్యాలతో భవిష్యత్ ప్రపంచ నగరాలలో ఒకటిగా నిలబడుతుందనే ధీమా వ్యక్తం చేశారు. టెక్నాలజీని చంద్రబాబు దగ్గరే నేర్చుకున్నానని మోదీ పేర్కొన్నారు. నేను గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా కొత్తగా పరిపాలన చేస్తున్నప్పుడు చంద్రబాబు హైదరాబాద్‌లో చేసిన టెక్నాలజీని చూసి స్ఫూర్తి పొందానని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్‌ల వల్ల ఏపీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని పేర్కొన్నారు.