Home Page SliderNationalNews AlertPolitics

కాంగ్రెస్ అగ్రనేతలకు కోర్టు నోటీసులు

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ పటియాలా హైకోర్టు నుండి నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల నేషనల్ హెరాల్డ్ పీఎంఎల్‌ఏ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది ఈడీ. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ ప్రతివాదులుగా చేర్చింది. వారి వాదనలు వింటామని తెలిపిన కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 8నాటికి వాయిదా వేసింది.