‘పాక్ ఒక రోగ్ కంట్రీ’..ఐక్యరాజ్యసమితిలో నిప్పులు చెరిగిన భారత్..
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగింది భారత్. న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రవాద అనుబంధ నెట్‌వర్క్ బాధితుల కార్యక్రమంలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజన పటేల్ మాట్లాడారు. పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ అని మండిపడ్డారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కుట్రలను బట్టబయలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని స్వయంగా పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బయటపెట్టిన సంగతిని పేర్కొంటూ ఇప్పుడు పాక్‌ను ఎందుకు క్షమించాలని ప్రశ్నించారు. భారత్ ఇకపై పాక్ దుశ్చర్యలను సహించదని, భారత్ రక్షణ కోసం, ఉగ్రవాద నిర్మూలన కోసం తగిన నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. భారత్‌పై నిరాధార ఆరోపణల కోసం అంతర్జాతీయ వేదికలను పాక్ దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

