పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక ఇదే…
సోమవారం వాటికన్ సిటీలో కన్నుమూసిన క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ చనిపోతూ తన అంత్యక్రియల గురించి చివరి కోరిక కోరారు. తన భౌతిక కాయాన్ని వాటికన్ వెలుపల సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి (రోమ్)లో ఖననం చేయాలన్నది ఆయన కోరిక అని గతేడాది ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు. అలాగే ఆర్చ్ బిషప్ డీగో జియోవని రవేలీతో కూడా గతంలోనే చర్చించారని సమాచారం. అయితే పోప్స్‌గా విధులు నిర్వర్తించిన వారి మృతదేహాలను వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలకా నేలమాళిగల్లో ఖననం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంప్రదాయాన్ని ఆయా వ్యక్తుల కోరిక ప్రకారం మినహాయిస్తున్నారు. 1903లో కూడా పోప్ లియో-13 మృతదేహాన్ని ఆయన కోరిక మేరకు సెయింట్ జాన్ లేటరన్ బాసిలికాలో ఖననం చేశారు.

