Andhra PradeshcrimeHome Page SliderNews Alert

కత్తులు చూపించి 3.7 కిలోల బంగారం దోపిడీ..

చిత్తూరు జిల్లా వి.కోటలో దారుణం జరిగింది. ఇక్కడ అటవీప్రాంతంలో ప్రయాణికుల వద్ద ఉన్న 3.7 కిలోల బంగారాన్ని కత్తులతో బెదిరించి  దుండగులు అపహరించారు. తమిళనాడులోని వేలూరు నుంచి కర్ణాటకలోని బంగారుపేటకు ఈ బంగారాన్ని తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారును అడ్డగించి కత్తులు చూపించి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు.ఈ ఘటనపై బాధితులు వి.కోట పోలీసులకు ఫిర్యాదు చేశారు.