ట్రంప్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై ప్రపంచ దేశాలు భగ్గుమంటున్నాయి. భారత్ సహా పలు దేశాలపై టారిఫ్‌ల మోత మోగించేస్తున్నారు. ఈ దేశాలలో మనుష్యులే లేని దీవులు, ఖండాలు కూడా ఉండడంతో ఆశ్చర్యపోతున్నారు. దీనితో ట్రంప్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. రకరకాల మీమ్స్, ఫోటోలతో ఆటపట్టిస్తున్నారు. అంటార్కిటికా దీవులు, ఆస్ట్రేలియా నియంత్రణలోని హియర్డ్, మెక్‌డొనాల్డ్ ఐలాండ్‌పై సుంకాలు విధించినట్లు ట్రంప్ ప్రకటించడంతో అందరూ మండిపడుతున్నారు. ఆయా దీవులలో పెంగ్విన్లు, ఇతర పక్షులు ఉండడంతో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ట్రంప్‌తో పెంగ్విన్లు చర్చలు జరుపుతున్నట్లు, టారిఫ్‌లు చెల్లిస్తున్నట్లు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
