లీవ్ ఇవ్వకుంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి..
సాధారణంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో లీవ్స్ ఇవ్వడం కష్టం. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఇదో పెద్ద సమస్య. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే లిమిటెడ్ సెలవులు ఇస్తారు. ఈ క్రమంలో మీ మేనేజర్ లీవ్ ఇవ్వకుంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి.. అంటూ ఓ నెటిజన్ ఆసక్తికర వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ యువతి మేకప్ ఆర్ట్ తన ముఖానికి తీవ్ర గాయాలై స్టిచెస్ పడినట్లు మేకప్ వేసుకుంది. ఆ మేకప్ ఆర్ట్ చూడ్డానికి అచ్చం నిజమైన గాయాల మాదిరిగానే ఉంది. అనంతరం తాను పనిచేసే సంస్థ మేనేజర్ కు వీడియో కాల్ చేసి ‘సర్ నేను ఆఫీస్ కు వస్తుంటే రోడ్ యాక్సిడెంట్ అయింది. గాయాలయ్యాయి. డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. కాబట్టి నాకు సిక్ లీవ్ ఇవ్వండి ప్లీజ్’ అంటూ రిక్వెస్ట్ చేసింది. దీంతో ఆమె ముఖంపై గాయాలు చూసి నిజమని నమ్మిన సదరు మేనేజర్ 5 రోజులు లీవ్ ఇచ్చి హెల్త్ జాగ్రత్త.. అని జాలి చూపిస్తాడు. అనంతరం ఆ యువతి వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన యూజర్.. మీ మేనేజర్ ను ఈ వీడియో చూడనివ్వకండి అని సూచించింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.