Breaking NewscrimeHome Page SliderNational

ఒలింపిక్స్ నిర్వ‌హించే స‌త్తా బార‌త్ కు ఉందా?

ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్స్​ను నిర్వహించడానికి భారత్​ ఆసక్తి చూపిస్తోంది. ఈ మేరకు 2036లో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ నిర్వహణకు ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేస్తూ గతేడాది అక్టోబర్​లో భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘానికి(ఐఓసీ) ఫ్యూచర్​ హోస్ట్​ కమిషన్​కు అధికారికంగా లేఖ పంపించింది. అయితే ఒలింపిక్స్​ను నిర్వహించడం అషామాషీ వ్యవహారం కాదు. అందుకు రూ. వేల కోట్లలో ఖర్చును భరించాల్సి ఉంటుంది. భారత్​లో ఒలింపిక్స్​ను నిర్వహించడానికి రూ.34,700 కోట్ల నుంచి రూ.64,000 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో గ‌త రెండు రోజుల నుంచి వ‌రుస‌ కథనాలు వస్తున్నాయి.2036లో భారత్​లో ఒలింపిక్స్​ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి గుజరాత్​లోని గాంధీనగర్​లో ఇటీవల హై లెవెల్ కో-ఆర్డినేషన్​ కమిటీ మేధోమథన సమావేశం జరిగింది. అందులో భారత్​లో ఒలింపిక్స్​ నిర్వహించాలని సంకల్పాన్ని పునరుద్ఘాటించినట్లు సమాచారం. అనంతరం ‘రివ్యూ మీటింగ్ – ప్రిపేర్డ్​నెస్​ టువార్డ్స్​ అందావాద్ 2036’ అనే డాక్యుమెంట్​ను విడుదల చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.